వరంగల్: రెండో భార్యను చంపిన కేసులో విచారిస్తుండగా మొదటి భార్యను తానే చంపానని పోలీసులు ఎదుట సైకో భర్త ఒప్పుకున్న సంఘటన వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కర్నె కిరణ్ మానసిక స్థితి సరిగా లేవపోవడంతో తల్లిదండ్రులు అతడికి పెళ్లి చేయలేదు. రైల్వే స్టేషన్లో ఒంటరిగా ఉండే మహిళను పెళ్లి చేసుకుంటానని కిరణ్ వెంటపడ్డాడు. ఆమె పెళ్లి చేసుకున్న అనంతరం ఆమెను పలుమార్లు వేధించాడు. ఆరు సంవత్సరాల క్రితం ఒక రోజు ఆమెను తీవ్రంగా కొట్టడంతో చనిపోయింది. ఈ విషయం బయటకు తెలియకుండా మృతదేహాన్ని ఇంటి వెనుక పూడ్చిపెట్టాడు. రెండు సంవత్సరాల క్రితం హుజురాబాద్‌లో నర్సుగా పని చేసే అంజలీబాయి అనే మహిళను కిరణ్ రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెను వేధించడమే కాకుండా పలుమార్లు ఆమెపై దాడి చేశాడు. రెండేళ్లు ఆమె ఇంటి వద్దనే ఉన్నాడు. ఆరు నెలల క్రితం ఏనుగల్లుకు వచ్చిన తరువాత ఇల్లు అమ్మి డబ్బు తీసుకరావాలని భార్యను వేధించాడు. మే 13న ఆమెను తీవ్రంగా కొట్టడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చనిపోయింది. దీంతో పోలీసులు కిరణ్‌ను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో మొదటి భార్యను కూడా తానే చంపానని ఒప్పుకున్నాడు. మొదటి భార్య అనాథ కావడంతో ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించారు. గతంలో సైకోగా వ్యవహరించిన కిరణ్‌ను ఎర్రగడ్డ ఆస్పత్రికి అప్పటి ఎస్ఐ రమేష్ నాయక్ తరలించాడు. ఎర్రగడ్డ ఆస్పత్రి నుంచి కిరణ్ తప్పించుకున్నాడు. అంజలీబాయి తల్లి ఓడపల్లి భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎసిపి నరేష్ కుమార్ తెలిపారు.
రెండో భార్యను చంపి… మొదటి భార్యను ఇంటి వెనుక పూడ్చి పెట్టి….
- Advertisement -
- Advertisement -
- Advertisement -