Monday, December 23, 2024

15 ద్విచక్రవాహనాలు, అటోను తగులబెట్టిన సైకో…

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: జీడిమెట్ల ప్రాంతం ఎన్ఎల్ బి నగర్ లోని రొడామిస్త్రి నగర్ లో ఓ సైకో ఇండ్ల వద్ద పార్కింగ్ చేసిన వాహనాలను తగలబెట్టారు. రొడామిస్త్రి నగర్ లో నివాసం ఉండే పరమేశ్వర్ (24) జులాయిగా తిరుగుతూ తరచూ ఇతరులతో గొడవ పడుతుంటాడు.  అర్థరాత్రి వివేకానంద నగర్ ప్రాంతంలో వివిద ఇండ్ల వద్ద పార్క్ చేసిన 15 బైకులతో పాటు ఒక ఆటోకు  నిందితుడు పరమేశ్వర్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. పెట్రోల్ అదే ద్విచక్రవాహనం నుంచి తీసి వాటిపై పోసి నిప్పు పెట్టాడు. రాత్రి రెండున్నర గంటల సమయంలో పొగలు రావడంతో స్థానికులు లేచి మంటలను ఆర్పేసిన అనంతరం జీడిమెట్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సిసి ఫూటేజ్ ఆదారంగా నిందితుడిని గుర్తించామని, అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. వాహనాలు పూర్తిగా తగలపడిపోయాయని, పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పరమేశ్వర్ సైకోగా ప్రవర్తిస్తాడని స్థానికులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News