సూపర్ స్టార్ ఉపేంద్ర ‘యుఐ ది మూవీ’ తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. లహరి ఫిల్మ్, జి మనోహరన్ అండ్ వీనస్ ఎంటర్‌టైనర్స్ కెపి శ్రీకాం త్ ఈ చిత్రాన్ని హై బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. నవీన్ మనోహరన్ సహ నిర్మాత. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదల కానుం ది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ర్వహించారు. స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన, నిర్మా త ఎస్‌కేఎన్ అతిధులుగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సూపర్ స్టార్ ఉపేం ద్ర మాట్లాడుతూ “సినిమా ఓపెనింగ్ నుంచే షాక్ అవుతారు. మీరు మైథలాజికల్ కల్కి చూశారు.
ఇందులో సైకలాజికల్ క ల్కి చూస్తారు. ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు ఓ కొత్త అ నుభూతినిస్తుంది”అని అన్నారు. డైరెక్టర్ బుచ్చిబాబు సాన మా ట్లాడుతూ “ఉపేంద్రకి నేను బిగ్ ఫ్యాన్‌ని. ఉపేంద్ర నటించిన ఓం, ఏ.. ఈ సినిమాలన్నీ చాలా ఇష్టంగా చూసేవాళ్ళు. ఉపేం ద్ర ఎన్నో ప్రయోగాలు చేశారు. ఈ సినిమాలో కూడా గొప్ప మ్యాజిక్ ఏదో ఉంటుందని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను”అని తెలిపారు. కార్యక్రమంలో హీరోయిన్ రేష్మ, అంబి కా రామచంద్రరావు, తులసిరాం, చంద్రు మనోహరన్, నవీన్ మనోహరన్, పార్థసారథి, రాంబాబు గోసాల పాల్గొన్నారు.