Wednesday, January 22, 2025

సైకాలజిస్ట్ బిపి నగేష్‌కు 16రోజుల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

Psychologist BP Nagesh sentenced to 16 days in jail

సెక్స్ ఛాట్ చేయాలని యువతులకు వేధింపులు
అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చిన హైదరాబాద్ షీటీమ్స్

హైదరాబాద్: యువతులు, మహిళలను సెక్స్ ఛాట్ చేయాలని వేధింపులకు గురిచేస్తున్న సైకాలజిస్ట్‌కు నాంపల్లి కోర్టు 16 రోజుల జైలు శిక్ష విధించింది. పోలీసుల కథనం ప్రకారం… ఎపిలోని గుంటూరు జిల్లా, ఏపూర్‌కు చెందిన డాక్టర్ బిపి నగేష్ సైకాలజిస్ట్‌గా హైదరాబాద్‌లోని పలు కాలేజీల్లో మోటివేషనల్ క్లాస్‌లు చెప్పేవాడు. క్లాస్‌లకు హాజరైన విద్యార్థులకు తన మొబైల్ నంబర్ ఇచ్చేవాడు. వారికి మోటివేషనల్ కొటేషన్లను పంపిస్తానని చెప్పేవాడు. ఇందులో యువతులు, మహిళలను తనను సంప్రదిస్తే చాలు అప్పటి నుంచి వారిని సెక్స్ ఛాట్ చేయాలని ఒత్తిడి చేసేవాడు. ఇలా నిందితుడి భారిన పడిన యువతులు హైదరాబాద్ షీటీమ్స్‌కు ఫిర్యాదు చేయడంతో అరెస్టు చేసి నాంపల్లికోర్టులో హాజరుపర్చారు. కోర్టు నిందితుడికి 16 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News