Monday, December 23, 2024

ఐఒఎ అధ్యక్షురాలు పిటి ఉష కంట కన్నీరు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లెజెండ్రీ అథ్లెట్, భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పిటి ఉష శనవారం మీడియా ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. కోజీకోడ్‌లో ఉన్న ఆమె అకాడమీలో అక్రమ కట్టడాలు, అకాడమీలో గుర్తుతెలియని వ్యక్తుల సంచారంతో అకాడమీలో ఉన్నవారి భద్రతకు ముప్పు పొంచి ఉందని వార్తలు వెలువడ్డాయి. దీనిపై ఉష ఢిల్లీలోని విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఉషా ఆఫ్ అథ్లెటిక్స్‌లో కొంతకాలంగా ఇలాంటి వేదింపులు, భద్రతా సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. తను రాజ్యసభ సభ్యురాలిని అయిన తరువాత వేదింపుల మరింత తీవ్రమైందని మీడియా సమావేశంలో తెలిపారు. పిటి ఉష రాజ్యసభకు బిజెపి ఎంపిగా 2022న నామినేట్ అయ్యారు.

విలేఖరుల సమావేశంలో స్ప్రింట్ క్వీన్ ఉష మాట్లాడుతూ.. కేరళలోని వామపక్ష ప్రభుత్వానికి, సిఎం పినరయి విజయన్ ఈ సమస్యపై స్పందించి ఆక్రమణలు అరికట్టాలని, అథ్లెట్లకు భద్రత కల్పించేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని విన్నవించారు. కాగా ఉష అకాడమీలో 25మంది మహిళా అథ్లెట్లు ఉన్నారు. వీరిలో 11మంది మహిళా అథ్లెట్లు ఉత్తర భారతానికి చెందినవారు. అకాడమీలో ఉన్నవారికి భద్రత కల్పించడం తమ బాధ్యత అని, ఈ విషయంపై సిఎంకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశానని ఆమె తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News