Wednesday, January 22, 2025

భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా పిటి ఉష

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా లెజెండరీ పిటి ఉష ఎన్నిక లాంఛనంగా నిలిచింది. డిసెంబర్ 10న జరిగే ఒలింపిక్ సం ఘం ఎన్నికలకు ఉష ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. 14మంది టీమ్ సభ్యు లు కూడా పలు పదవులకు నామినేషన్ దాఖలు చేశారు. అయితే అధ్యక్ష పదవికి ఇంకెవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో 58ఏళ్ల పరుగు ల రాణి అధ్యక్షురాలిగా దాదాపు ఖరారయ్యారు.

నామినేషన్లు దాఖలు చేయడానికి వారంతో గడువు ముగియగా పదవులకు 24మంది దాఖలు చేశారు. వీరిలో 12మంది కార్యనిర్వాహక మండలి సభ్యులస్థానాలకు పోటీపడుతున్నారు. కాగా ఉష ఆసియా గేమ్స్‌ల్లో బంగారు పతకాలు సాధించారు. 1984 లో జరిగిన 400మీటర్ల ఫైనల్లో నాలుగో స్థానంలో నిలిచారు. కాగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఒఎ) అధ్యక్ష పదవి చేపట్టిన తొలి మహిళగా ఉష రికార్డు సృష్టించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News