Tuesday, April 8, 2025

షిండే ప్రభుత్వంపై ప్రజాగ్రహం: కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

ముంబై: మహారాష్ట ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ఏక్‌నాథ్ షిండే సర్కార్‌పై ఆగ్రహంతో ఉన్న ప్రజలు తమను ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారని మహారాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ రమేశ్ చెన్నితల ధీమా వ్యక్తం చేశారు.

ఆగస్టు 7న ముంబైలో మహావికాస్ అఘాడీ తొలిభేటీతో అధికారిక చర్చలు ప్రారంభమవుతాయని, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలు, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే హాజరు కానున్నారని తెలియజేశారు. ఎంవీఏ సీట్ల సర్దుబాటు, ముఖ్యమంత్రి అభ్యర్థి గురించి త్వరలో ప్రకటిస్తామని రమేశ్ చెన్నితల వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News