Tuesday, January 14, 2025

ఈవిఎం మిషన్లపై ప్రజలకు అవగాహన

- Advertisement -
- Advertisement -

అచ్చంపేట: రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం అచ్చంపేట పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయంలో ఈవిఎం ప్యాడ్లపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందని ఆర్డిఓ గోపి రామ్, తహసిల్దార్ కృష్ణయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటును వినియోగించుకునేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు వారు సూచించారు.

అదే విధంగా నూతనంగా ఓటు ఆప్లై చేసుకునే వారు అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు కలిగి ఉండాలని, యువతను ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ నెల 30వ తేదీలోగా ఆన్లైన్‌లో గాని తమ పరిధిలోని బిఎల్‌ఓ ద్వారా ఓటు నమోదు కార్యక్రమం పూర్తి చేసుకోవాలని వారు తెలిపారు. ఈ అవగాహన సదస్సులో వివిధ మండలాల ప్రజలతో పాటు నాయకులు, డిటిలు రాములు, అశోక్, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News