Thursday, January 23, 2025

ప్రజావాణి సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించాలి

- Advertisement -
- Advertisement -
  • సిద్దిపేట అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

సిద్దిపేట అర్బన్: ప్రజావాణి సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. దరఖాస్తులను స్వీకరించివారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులను పిలిచి దరఖాస్తులను అందజేసి వాటి పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా సేకరించిన ధరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించి నివేదికలను కలెక్టరేట్‌కు అందజేయాలని అదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి ఆసరా పెన్షన్లు, డబుల్ బెడ్‌రూమ్‌లు, తదితర సమస్యలపై 49 దరఖాస్తులు వచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఎఓ అబ్ధుల్ రహమాన్ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News