Monday, December 23, 2024

ప్రజావాణి సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించాలి

- Advertisement -
- Advertisement -
  • సిద్దిపేట అదనపు కలెక్టర్ గరిమా ఆగర్వాల్

సిద్దిపేట: ప్రజావాణి సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ గరిమా ఆగర్వాల్ అన్నారు.సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. దరఖాస్తులను స్వీకరించివారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులను పిలిచి ధరఖాస్తులను అందజేసి వాటి పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా సేకరించిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించి నివేదికలను కలెక్టరేట్‌కు అందజేయాలని అదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి ఆసరా పెన్షన్లు, డబుల్ బెడ్‌రూమ్‌లు, తదితర సమస్యలపై 58 దరఖాస్తులు వచ్చామని తెలిపారు. అలాగే జిల్లా అధికారులు తప్పనిసరిగా ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News