- అదనపు కలెక్టర్ జి. వెంకటేశ్వర్లు
మెదక్: ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలను ఆయా శాఖల అధికారులు పరిశీలించి దరఖాస్తుదారుని సమస్యను ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ జి. వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి నిర్వహించి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఆయా శాఖలలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సంబంధిత శాఖాధికారులు పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. ఆర్జీదారులు దూరప్రాంతాల నుంచి వస్తారని వారి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజావాణిలో 128 దరఖాస్తులు పలు సమస్యలపై రావడం జరిగిందని, ఆయా శాఖల అధికారులు ఆర్జీలపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజావాణిలో కౌడిపల్లి మండలం కూకుట్లపల్లి గ్రామానికి చెందిన గొల్ల దుర్గయ్య అనే వికలాంగునికి మూడు చక్రాల సైకిల్‌ని అదనపు కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సంబందిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.