Sunday, December 22, 2024

ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలి

- Advertisement -
- Advertisement -

మధిర : ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ఉపాధ్యాయుల పైన కూడా ఉందని, ఆ దిశగా ఉపాధ్యాయులందరు కృషి చేయాలని టీఎస్ యుటిఎఫ్ ఖమ్మం జిల్లా కార్యదర్శి షేక్ నాగూర్ వలి పిలుపునిచ్చారు. 2023 సంవత్సరానికి సంబంధించిన సభ్యత్వ మరియు ఫండ్ క్యాంపెయిన్ గురువారం ప్రారంభమైంది. ముందుగా స్థానిక సంఘ కార్యాలయం వద్ద టీఎస్ యుటిఎఫ్ సీనియర్ సభ్యులు జిల్లా సత్యనారాయణ ఉద్యమ పతాకాన్ని ఊపి క్యాంపెయిన్ ప్రారంభించారు. అనంతరం మండలంలోని వివిధ పాఠశాలలను సందర్శించి క్యాంపెయిన్ నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా నాగూర్ వలి మాట్లాడుతూ, ఉపాధ్యాయుల పట్ల విద్యారంగం పట్ల పెను శాపం గా ఉన్న సిపిఎస్, ఎన్‌ఈపి విధానాన్ని రద్దు చేయాలని, డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు కూడా పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలని, ఎన్ ఈపి మరియు సిపిఎస్ రద్దు కోరుతూ యూటీఎఫ్ మరియు భాగస్వామ్య సంఘాల ఆధ్వర్యంలో జరిగే పోరాటాల్లో ఉపాధ్యాయులు విరివిగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు లేక ఉపాధ్యాయ లోకం అంతా తీవ్ర నైరాస్యంలో ఉన్నారని, కోర్టు తీర్పు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో అడ్ హక్ పద్ధతిలో వెంటనే పదోన్నతులు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక్కరి కోసం అందరం అందరికోసం ప్రతి ఒక్కరం అనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన టీఎస్ యుటిఎఫ్ కుటుంబ సంక్షేమ నిధిలో ఉపాధ్యాయులు విరివిగా చేరాలని ఆయన పిలుపునిచ్చారు. టిఎస్‌యుటిఎఫ్ మధిర మండల అధ్యక్షులు ఏ. వినోద్ రావు ఆధ్వర్యంలో* నిర్వహించబడిన ఈ కాంపెయిన్ లో టీఎస్ యుటిఎఫ్ నాయకులు కస్తూరిబాయి, వీరయ్య, లాలహమ్మద్, భీమశంకర్, ఇబ్రహీం, భాస్కర్, సాధువు సమాధానం, రాజు, చెన్నయ్య, రమేష్, జిబిఎంఎస్ రాణి, కవిత, స్వాతి, శోభారాణి, కృష్ణారావు, జగన్నాథం, సత్యనారాయణరెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News