Monday, January 20, 2025

కార్పోరేట్ దిశగా ప్రభుత్వ విద్య

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి ప్రతినిధి : మన ఊరు మన బడి ద్వారా ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెరిగిందని కార్పోరేట్ దిశగా ప్రభుత్వ విద్యా కొనసాగుతుందని కామారెడ్డి జడ్పి చైర్పర్సన్ దఫేదర్ శోభ రాజు అన్నారు. మంగళవారం విద్యా, గ్రామీణబివృద్ధ్ది, పనులు ఆర్థిక ప్రణాళిక స్థాయి సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పలు అంశాలపై సభ్యలతో చర్చించి సింగీతం ప్రాజెక్టు బిడ్జ్రి మం జూరు చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సిగీతం వాగు వంతెనకు 80 లక్షలు రూపాయలు విడుదల చేస్తూ జీఓ జారి చేసిన సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు.

వాగు అవతల గ్రామానికి చెందిన 500 ఎకరాల భూమిగల రైతులు ఇబ్బందులు గుర్తుంచుకొని నిధులు మంజూరు చేశారు. మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలలో 12 రకాల మౌళిక వసతులు కల్పించామని అన్నారు. హరితహారం కార్యక్రమంలో పెద్ద ఎత్తున మెక్కలు నాటాలని 50 శాతం ఇండ్ల వద్ద మిగత శాతం ఇతర ప్రాంతాలలో నాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటీసిలు మనోహర్‌రెడ్డి, శంకర్‌నాయక్, శ్రీలత, రమ్‌రెడ్డి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సాయగౌడ్ అయ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News