Monday, December 23, 2024

ప్రజారోగ్యమే ప్రభుత్వ ధ్యేయం

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ సారధ్యంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. బీబీనగర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి నూతనంగా కేటాయించిన 108 అంబులెన్స్ సర్వీసును బుధవారం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైద్యసేవలు మెరుగుపరిచి ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యసేవలు అందించడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 108 అంబులెన్స్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ప్రజల ఆరోగ్య సంక్షేమం కోసం బీఆర్‌ఎస్ ప్ర భుత్వం ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. తెలంగాణలో మరల రానుంది బీఆర్‌ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వీర రెడ్డి, ఎంపిపి యర్కల సుధాకర్ గౌడ్, జడ్పీటీసీ సభ్యులు గోలి ప్రణీత పింగల్ రెడ్డి,రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ బొక్క జైపాల్ రెడ్డి,స్థానిక సర్పంచ్ మల్లగారి భాగ్యాలక్ష్మీ శ్రీనివాస్,ఎంపీటీసీలు గోరుకంటి బాలచందర్, గోలి నరేందర్ రెడ్డి, టంటం భార్గవ్,కో అప్షన్ సభ్యులు ఎండీ అక్బర్, బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శులు రాచమల్ల శ్రీనివాస్, చింతల సుదర్శన్ రెడ్డి,నాయకులు అల్వా మోహన్ రెడ్డి,నగేష్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News