Monday, December 23, 2024

ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వ వైద్యసేవలు

- Advertisement -
- Advertisement -

జమ్మికుంట : రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులలో రాష్ట్ర ప్రభుత్వం వైద్యసేవలు అం దిస్తుందని రాష్ట్ర ఎస్‌సి కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. బుధవాం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌హాల్‌లో రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిలుగా ఎస్‌సి కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డిలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజలకు సరైన సమయంలో వైద్యసేవలు అందక అనేక మంది ప్రాణాలు కోల్పోయారిని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవి భాద్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో ని పేద, మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు విశేష కృషి చేశారని కొనియాడారు.

కార్యక్రమం అనంతరం వావిలాల ప్రాథమికి ఆరోగ్య కేంద్రం ఏఎన్‌ఎంలకు, ఆశాకార్యకర్తలకు చీరల పంపిణీ చేశారు. అనంతకుముందు వైద్యసిబ్బంది ఆధ్వర్యంలో అంబేడ్కర్ చౌరస్తా నుండి కార్యక్రమం నిర్వహించే పంక్షన్‌హాల్ వరకు ఏఎన్‌ఎం లు, ఆశాకార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు బతుకమ్మ ఎత్తుకుని, కోలాటాలు వేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, ఎంపీపీ డి.మమతప్రసాద్, జడ్పీటీసీ డాక్టర్ శ్రీరాం శ్యాం, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ దేశిని స్వప్నకోటి, పిఎసిసి చైర్మన్ పొనగంటి సంపత్‌ర తహసీల్దార్ బండి రాజేశ్వరి, మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్, వివిధ మండలాలకు చెందిన ప్రజాప్రతినిదులు, వైద్యులు, వైద్యసిబ్బంది, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News