Wednesday, January 22, 2025

నేడు కౌలు రైతుల సమస్యలపై బహిరంగ విచారణ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కౌలు రైతుల గొంతు రాష్ట్ర స్థాయిలో వినిపించేందుకు రైతు స్వరాజ్య వేదిక బహిరంగ విచారణ కార్యక్రమాన్ని చేపట్టింది. మంగళవారం ఉదయం 11గంటలకు బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. పలు జిల్లాల నుండి 150 మంది కౌలు రైతులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ప్రముఖుల జ్యూరీ ముందు వారు తమ సమస్యలను స్వయంగా వివరిస్తారు. తరువాత జ్యూరీ సభ్యులు స్పందించి వారి తీర్పుని ఇస్తారు. అనేక రాజకీయ పార్టీల, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని కౌలు రైతుల సమస్యలపై స్పందిస్తారు.

జ్యూరీ సభ్యులు జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ప్రొ. యోగేంద్ర యాదవ్, టి. గోపాల రావు (మాజీ ఐఎఎస్), కవిత కురుగంటి పాల్గొననున్నారు. కౌలు రైతుల సమస్యల పై స్పందించే పార్టీల, ప్రజా సంఘాల నాయకుల్లో మధు యాష్కీ (కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్), ప్రొఫెసర్ కోదండరామ్ (టిజెఎస్ అధ్యక్షులు), ఆర్. ఎస్ . ప్రవీణ్ కుమార్ (బిఎస్పీ అధ్యక్షులు), తమ్మినేని వీర భద్రం (సిపిఎంకార్యదర్శి), కూనంనేని సాంబశివరావు (సిపిఐ కార్యదర్శి), ఆకునూరి మురళి, జాగో తెలంగాణ కన్వీనర్ ఆకునూరి మురళి, టిపిజేఏసి కో న్వీనర్ అంబటి నాగయ్య తదితరులు పాల్గొననున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News