Sunday, January 19, 2025

ప్రైవేట్ కు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. బుధవారం ప్రజా ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని రకాల అత్యాధునిక వసతులతో నిర్మించిన పల్లె, బస్తీ దవాఖానాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జనరల్ ఆసుపత్రికి భారిగా పెరిగిన రోగులకు అందిస్తున్న సేవలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ శారదా దేవి, జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళిధర్‌రెడ్డి, సిబ్బంది తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News