- జిల్లా పరిషత్ చైర్మన్ బడే నాగజ్యోతి
ములుగు జిల్లా ప్రతినిధి: ప్రజా నాయకుడు, మలిదశ ఉద్యమ కారుడు జిల్లా పరిషత్ చైర్మన్ దివంగత కుసుమ జగదీశ్వర్ 47వ జయంతి సందర్భంగా ములుగు మండల అధ్యక్షుడు బాధం ప్రవీణ్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా జడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి ఆదివారం హాజరై జగదీశ్వర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, కేక్ కట్ చేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు.
అనంతరం దివంగత జడ్పీ చైర్మన్ నివాసం మల్లంపల్లి లో కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలతో కలిసి జయంతి వేడుకలు నిర్వహించి, జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమకాలం నుండి కేసిఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర సాధనలో అనేక కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి దివంగత జడ్పీ చైర్మన్ అని అన్నారు. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత జగదీష్ సేవలను గుర్తించి పార్టీ అధిష్టానం జిల్లా పరిషత్ చైర్మన్ గా అవకాశం కల్పించి పార్టీని ముందుకు నడిపించే సత్తా ఉన్న నాయకుడిగా గుర్తించి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగిందని అన్నారు. జిల్లా అభివృద్ధిలో చురుకుగా ఉండే జగదీష్ మరణం పార్టీకి, జిల్లా ప్రజలకు తీరని నష్టమని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, ఎంపిటీసిల ఫోరం జిల్లా అధ్యక్షుడు విజయ్ రామ్ నాయక్, యువజన విభాగం అధ్యక్షుడు కోగిల మహేష్, సోషల్ మీడియా అధ్యక్షుడు శీలం మధు, డిసిసిబి డైరెక్టర్ మాడుగుల రమేష్, వైస్ ఎంపిపి ఊర విజయలక్ష్మి, ఎంపిటీసి గొర్రె సమ్మయ్య, పిఏసిఎస్ డైరెక్టర్ బైకని సాగర్, సర్పంచ్‌లు దాసరి రమేష్, రాములు, వెంకటస్వామి, రాజయ్య, మోహన్, ఆదిరెడ్డి, రామాచారి, రాము, భద్రయ్య లు పాల్గొన్నారు.