Thursday, December 26, 2024

ఉత్సవాల పేరిట ప్రజా ధనం వృథా

- Advertisement -
- Advertisement -

స్టేషన్ ఘన్‌పూర్: దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రభుత్వం ప్రజా ధనం వృథా చేస్తున్నారని పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి సింగపురం ఇందిర అన్నారు. గు రువారం డివిజన్ కేంద్రంలోని బస్టాండ్ సమీపంలోని అం బేద్కర్ విగ్రహం ముందు కాంగ్రెస్ ఆధ్వర్యంలో సిఎం కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాల మీద తహసీల్దారు పూల్‌సింగ్ చౌహాన్‌కు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఇందిర మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చి పదేళ్ల పూర్తి కాకముందే ప్రజాధనాన్ని వృథా చేస్తూ ప్రచారం చేస్తున్నారన్నారు.

అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఏర్పడ్డ తొమ్మిదేళ్లకే బిఆర్‌ఎస్ పార్టీ తన రాజకీయ లబ్ధి కోసం దశాబ్ది ఉత్సవాలు జరుపుతుందన్నారు. ఈ తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ ప్ర జలకు బిఆర్‌ఎస్ ఒరగబెట్టిందేమీ లేదన్నారు. ఈ కా ర్యక్రమంలో జూలకంటి శిరీష్‌రెడ్డి, కోరుకొప్పుల మహే ందర్‌గౌడ్, కోళ్ల రవిగౌడ్, లింగాల జగదీష్, చందర్‌రెడ్డి, లిం గాజీ, చింత ఎల్లయ్య, సింగపురం వెంకటయ్య, సింగపురం నాగయ్య, గట్టు కోటి, చింత జ్యోస్న, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News