Sunday, January 19, 2025

నేటి నుంచి రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ

- Advertisement -
- Advertisement -

ఉమ్మడి జిల్లాల్లో మంత్రుల పర్యటనలు
పది నుండి 22వరకూ జిల్లాల్లో వర్క్ షాప్ లు
తొలిరోజు ఖమ్మం సదస్సుకు ముగ్గురు మంత్రులు

మనతెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు విధి, విధానాలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు చైర్మన్ గా, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు. సభ్యులుగా కమిటీని ఖరారు చేసింది. ఈ కమిటీ ఈనెల 10వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో వరుసగా పర్యటించనుంది.

ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రైతు భరోసా పథకం అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ పథకానికి సంబంధించి అన్ని జిల్లాల్లో అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు వినాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల నుంచే ప్రభుత్వం రైతు భరోసా కు నిధులు చెల్లిస్తోంది. అందుకే ప్రజా ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రైతు సదస్సులు నిర్వహిస్తూ అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఇక జిల్లా స్థాయిల్లో రైతులు ,రైతు సంఘాలు ,ప్రజాప్రతినిధులు, ఇతర వర్గాల వారినుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. పాత పది జిల్లాల్లో వర్క్ షాప్ ల ద్వారా ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలను మధించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేయనుంది.

నేడు ఖమ్మం నుంచి ప్రారంభం
రైతుభరోసా పథకం విధి విధానాలు రూపొందించేందుకు ప్రజాభిప్రాయం సేకరించాలని నిర్ణయించిన ప్రభుత్వం జిల్లా స్థాయి వర్క్‌షాపులు నిర్వహించనుంది. హైదరాబాద్ జిల్లా మినహా మిగిలిన తొమ్మిది ఉమ్మడి జిల్లల్లో సదస్సుల నిర్వహణకు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. వీటిని బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లానుంచి ప్రారంభించనుంది. 11న అదిలాబాద్ ,12న మహబూబ్‌నగర్, 15న వరంగల్, 16న సంగారెడ్డి(మెదక్) , 18న నిజామాబాద్, 19న కరీంనగర్, 22న నల్లగొండ,23న రంగారెడ్డి జిల్లాల్లో ఈ సదస్సులు నిర్వహించనున్నారు.తొలిరోజు జరిగే ఖమ్మం జిల్లా సదస్సుకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు ముగ్గురు మంత్రులు పాల్గొననున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News