Sunday, December 22, 2024

ప్రజా సమస్యలకు ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించాలి

- Advertisement -
- Advertisement -
  • జెడ్పి చైర్ పర్సన్ దఫేదార్ శోభ

కామారెడ్డి ప్రతినిధి : ప్రజా సమస్యల గురించి సభలో ప్రజాప్ర తినిధులు లూవనెత్తిన సమస్యలు,పశ్నలకు అధికారులు అత్యంత ప్రా ధాన్యతనిచ్చి పరిష్కరించాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దఫేదార్ శోభ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశమందిరంలో జెడ్పిచైర్ పర్సన్ అధ్యక్షతన జరిగిన సమావే శంలో ఆమె మట్లాడుతు క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేసే ప్రజాప్రతిని ధులకు సమస్యలు తెలునని సభలో వారు ఏకరువు పెట్టినా సమస్యల పరిష్కార దిశగా అధికారులు చిత్తశుద్దితో పని చేయాలని కోరారు.

అంతకుముందు రాష్ట్ర ప్రభు త్వం రైతులకు రుణమాఫీ, గ్రామ రెవెన్యూ సహాయకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, ఆర్‌టిసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగులకు అండగా నిలవడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదములు తెలుపుతూ జెడ్పి వైస్ చైర్మన్ ప్రేమ్‌కుమార్ ప్రవేశపెట్టిన తీర్మానాలపై సభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా వ్యవసాయం, పశు సంవర్దకం, విద్య, వైద్య, నీటిపారుదల, విద్యుత్, రోడ్లు, భవ నాలు,పంచాయతీరాజ్,డి,ఆర్‌డిఓ శాఖ ప్రగతిని సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ విపాటిల్, ఎంపి బీబీ పాటిల్, శాసనసభ్యులు హనుమంత్ షిండే, జాజాల సురేందర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మను చౌదరి, జెడ్పి సీఈవో సాయగౌడ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News