Saturday, December 21, 2024

ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి

- Advertisement -
- Advertisement -

నల్గొండ: ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ కుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పరిషార నిమిత్తం వచ్చిన ప్రజల నుండి మొత్తం 60 దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వాలని, పెండింగ్‌ అర్జీలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయాలని సంబంధిత శాఖలను ఆమె ఆదేశించారు. ఈ సమావేశంలో డి.అర్.డి. ఓ. కాళిందిని,గృహ నిర్మాణ పి.డి.రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News