Friday, December 27, 2024

ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి

- Advertisement -
- Advertisement -
  • జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్

సిద్దిపేట అర్బన్ : ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ అన్నారు. సోమవారం ఐడీఓసీ మీటింగ్ హాల్‌లో జరిగిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అందించిన ప్రజా వినతులు, ఫిర్యాదులను అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి స్వీకరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ప్రజావాణి నుండి అర్జీలు తీసుకోవడమే కాకుండా వాటి పరిష్కారాలను మళ్లీ వారం లోపు తెలపాలన్నారు. ప్రజలు నుండి మళ్లీ మళ్లీ ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలన్నారు. ప్రజావాణిలో భూసంబంధిత, ఆసరా పింఛన్లు ఇతర మొత్తం కలిపి 15 అర్జీలు వచ్చాయని తెలిపారు. అధికారులందరూ విధిగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి తప్పక హాజరుకావాలని జిల్లా అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో నాగరాజమ్మ, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News