జన్నారం : కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులో ప్రజా ప్రతినిధులు పర్యటించారు. ఆదివారం అటవీ శాఖ ఆద్వర్యంలో ఉన్న సఫారీలలో ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు కుటుంబ సమేతంగా పర్యటించి అందాలను తిలకించారు. అడవిలో తిరుగుతున్న జంతువులను చూసి ప్రజా ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు.
అదే విధంగా అడవిలో చేపట్టిన పనులను పరిశీలించారు. పర్యటించిన వారిలో ఎంపీపీ మాదాడి సరోజన రవిందర్‌రావు, జడ్పీటీసీ ఎర్ర చంద్ర శేఖర్, వైస్ ఎంపీపీ సుతారి వినయ్‌కుమార్, కో ఆప్షన్ సభ్యులు మున్వర్ ఆలీఖాన్, వివిధ గ్రామాలకు చెందిన ఎంపీటీసీ సభ్యులు యాదగిరి స్వరూపరాణి, జాడి భూ మక్క, జులుగురి మాదురి సతీష్, సాగె శ్రీవాణి, కొంతం శంకరయ్య, గుండావరపు హరిణి మధుసుధన్‌రావు, కాసెట్టి పద్మ రాజన్న, దాముక మమత కరుణాకర్, ఆడె లలిత, దర్శనాల వెంకటస్వామి, కుమ్రం సౌజన్య పవన్, మచ్చ పోశవ్వ, కుటుంబ సభ్యులతో పాటు పర్యటించిన వారిలో ఉన్నారు. వీరి వెంట స్థానిక రేంజ్ ఆఫీసర్ లక్ష్మినారాయణ, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ తిరుపతిలు ఉండి అడవిలో జరిగిన అభివృద్ధ్ది పనులను వివరించారు.