హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాన్ని 30 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినందుకు రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యుల గౌరవ వేతనాన్ని 10 వేల నుండి 13 వేల రూపాయలకు, మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులు, గ్రామ సర్పంచుల గౌరవ వేతనం 5 వేల రూపాయల నుండి 6500 రూపాయలకు పెంచడం జరిగిందని మంత్రి తెలిపారు. పెంచిన వేతనాలు జూన్ నుంచి అమల్లోకి వస్తాయన్నారు. స్థానిక సంస్థలకు కరోనా ప్రభావం ఉన్న నిధుల్లో కొత విధించకుండా నిధులు విడుదల చేస్తున్నారమని పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు, పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అమలు చేయడంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మరింత క్రీయాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.
ప్రజాప్రతినిధుల వేతనాలు పెంపు… కెసిఆర్ కు కృతజ్ఞతలు: ఎర్రబెల్లి
- Advertisement -
- Advertisement -
- Advertisement -