వేల సంఖ్యలో క్యూ కట్టిన జనం,
మొరాయించిన సర్వర్లు దాదాపు
18లక్షల రేషన్ కార్డుల్లో మార్పుచేర్పులకు
అవకాశం కొత్త కార్డుల కోసం
కులగణనలో 7 లక్షలు, ప్రజావాణిలో
12.5లక్షల దరఖాస్తులు ఛార్జీలు
పెంచిన మీసేవ నిర్వాహకులు నిరంతర
ప్రక్రియ అంటున్న పౌరసరఫరాల శాఖ
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులపై ఉత్కంఠ నెలకొంది. దాదాపు నా లుగు సంవత్సరాల తర్వాత కొత్త రేషన్ కార్డుల ద రఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావడంతో ప్రజలు ఒక్కసారిగా మీసేవా కేంద్రాల ముందు క్యూ క ట్టారు. దాంతో మీ సేవా నిర్వహకులకు, స్థానిక పోలీసుల యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. రేషన్ కార్డుల ధరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్ర క్రియ అని ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రజ లు మీసేవ కేంద్రాలకు చేరుకున్నారు.వాస్తవానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2021లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణను రద్దుచేసింది. దాంతో అ ప్పటి నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు ఇటీవల ప్రభుత్వ నిర్ణయం ఎంతో ఊరటనిచ్చింది. కొత్త రేషన్ కార్డులపై పౌరసరఫరాల శాఖ జారీచేసిన ఆదేశాల మేరకు మీ సేవ కేంద్రాల నిర్వాహకులు కొత్త రేషన్ కార్డుల ధరఖాస్తుల స్వీకరణ ప్రారంభించడంతో బుధవా రం మీ సేవా కేంద్రాల్ల వద్ద జనం కిక్కిరిసిపోయా యి. కొన్ని రోజులుగా పౌరసరఫరాల శాఖ నుంచి డైరెక్టర్,
మీసేవ కు రాసిన లేఖ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రజావాణిలో,కులగణనసందర్భంగా, ప్ర జా పాలన కార్యక్రమాల్లో కొత్త రేషన్ కార్డుల కో సం వేలాది మంది పేదలు దరఖాస్తులు చేసుకున్నారు. గత ఎనిమిది సంవత్సరాలుగా రేషన్ కా ర్డులు కలిగిఉన్న కుటుంబాలు వారి రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు నోచుకోలేకపోయారు. దాంతో ప్రజానీకం కొత్త రేషన్ కార్డుల కోసం, ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల్లో మార్పుల కోసం మీసేవ కేంద్రాలకు చేరుకున్నారు. రాష్ట్రంలో 2016 సంవత్సరం నుంచి రేషన్ కార్డులు కలిగి ఉన్న కుటుంబాల సభ్యులకు పుట్టిన పిల్లల వివరాలు చేర్చే అవకాశం లేకుండా పోయింది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 18లక్షల రేషన్ కార్డుల్లో మార్పుచేర్పులు జరగాల్సి ఉంది. ఇదిలా ఉండగా ప్రజావాణిలో, కులగణన సందర్భంగా, ప్రజా పాలన కార్యక్రమాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం ధరఖాస్తు చేసుకున్న వారు తిరిగి మీ సేవ కేంద్రాల్లో చేయాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు.