Sunday, December 22, 2024

ప్రజా సేవే ధ్యేయం.. ప్రజలే నా బలగం

- Advertisement -
- Advertisement -

తెలకపల్లి : ప్రజాసేవే నా లక్షం ప్రజలే నా బలగం అని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. మంగళవారం పదేళ్ల ప్రజా ప్రస్థానంలో భాగంగా మండలంలోని పెద్దపల్లి, గౌతమ్ పల్లి, అనంతసాగర్, బండపల్లి గ్రామాలలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు మహిళలు, ప్రజలు మంగళ హా రతులో, బోనాలు, బతుకమ్మలతో, కోలాటాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రభుత్వం ప్రజలకు సేవ చేయడమే లక్షంగా పనిచేస్తుందన్నారు.

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పల్లెల్లో ఎన్నో రకాల సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసిందని, ప్రజలు, రైతుల కోసం త్రాగునీరు, రైతు బంధు నుంచి రైతు భీమా వరకు ఎన్నో రకాల సంక్షేమ పథకాలు, సౌకర్యాలను ఏర్పాటు చేసిందన్నారు. తాను ఎమ్మెల్యేగా పెద్దపల్లి బుగ్గ స్వామి దేవాలయం పనుల కోసం 50 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. అదే విధంగా గ్రామాలలో మౌళిక వసతుల కల్పనకు గ్రామాల స్వచ్ఛత అభివృద్ధికి ప్రత్యేక నిధులతో గ్రామాలను స్వచ్చ గ్రామాలుగా తీర్చినట్లు వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి, బిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బైకాని శ్రీనివాస్ యాదవ్, ఎంపిపి కొమ్ము మధు, మండల పార్టీ అధ్యక్షులు ఈదుల నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మెన్ మాధవరం హనుమంత రావు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News