మన తెలంగాణ /సిటీ బ్యూరో: నగరవాసుల సమస్యల సత్వర పరిష్కారంపై జిహెచ్‌ఎంసి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారానికి సిటీజన్ సెంట్రల్ గ్రీవెన్స్ రీ-డ్రెసాల్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది ఈ విధానంలో ద్వారా సమస్యలు సత్వరమే పరిష్కారం అవతుండడంతో నగరవాసులు పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వీకరించిన విన్నపాలను పరిష్కారించిన తర్వాత అర్జీ దారునికి కాల్ సెంటర్ నుండి ఫోన్ చేసి ఫీడ్ బ్యాక్ సేకరించి వారు వ్యక్తం చేసిన అభిప్రాయం మేరకు గ్రేడ్ కూడా నిర్ణయిస్తారు. అదేవిధంగా సమస్య పరిష్కరం పట్ల ఫిర్యాదుదార్లు అసంతృప్తి వ్యక్తం చేస్తే దానిని పూర్తిగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఫిర్యాదు దారుడు సమస్య పరిష్కారం తర్వాత పిర్యాదుదారుడే స్వయంగా తన వినపాన్ని తొలగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రజల నుండి వివిధ మాధ్యమాల ద్వారా వచ్చిన, వ్యక్తిగత సామాజిక సమస్యలపై ఫిర్యాదులను పరిష్కరించి వారి స్పందన తెలుసుకొనుటకు ఒక సారి కాదు మూడు సార్లు ఫోన్ చేసి సమస్య పరిష్కారం పై అర్జీదారుల నుండి పొందిన ఫీడ్ బ్యాక్ నుతీసుకుంటారు. దీంతో నగరవాసులు ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.కొన్ని సందర్భాల్లో జిహెచ్‌ఎంసిహెల్ప్ లైన్ కు ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలు వచ్చినా తనకు సంబంధం లేకున్నా ఇతర శాఖల విభాగాల కుతెలియజేసి పరిష్కారానికి కృషి చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.సెంట్రల్ గ్రీవెన్స్ గా ఉపయోగిస్తున్న కంట్రోల్ రూమ్ (హెల్ప్ లైన్ ) ద్వారా వచ్చిన వ్యక్తిగత, సామాజిక సమస్యల పై వచ్చిన విన్నపాలను సత్వర పరిష్కారించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నగర వాసుల నుండి హెల్ప్ లైన్ నెంబర్ కు గాని, ట్విట్టర్ గాని, మై జిహెచ్‌ఎంసి యాప్‌ద్వారా గాని, డయల్ 100 ద్వారా గాని ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చిన విన్నపాలను పరిష్కరించడం ధ్యేయంగా రౌండ్ ది క్లాక్ 24 గంటలపాటు పని చేస్తుంది. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటిఆర్ నిర్దేశించిన ప్రకారం గా కమిషనర్ జిహెచ్‌ఎంసిలోఫిర్యాదుల స్వీకరణ, మానిటరింగ్, పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ 24 గంటల పాటు పని చేసే విధంగా వ్యవస్థ ను ఏర్పాటు చేశారు. ఆయా విభాగాలకు సంబంధించి సిబ్బంది 24 గంటల పాటు మూడు షిఫ్ట్‌ల్లో 7 గంటల చోప్పున పని చేస్తారు. వచ్చిన పిర్యాదులు స్వీకరించి సత్వర పరిష్కారం కోసం ఫస్ట్ లెవెల్ లో క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న ఆయా విభాగాల అధికారులకుపంపించి సాధ్యమైనంత తొందరగా పరిష్కారం చేసే విధంగా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.
హెల్ప్ లైన్ (కంట్రోల్ రూమ్) ద్వారా స్వీకరించిన విన్నపాలను స్వల్పకాలిక (షర్ట్ టైం),దీర్ఘకాలిక ( లాంగ్ టర్మ్) సమస్యలను గుర్తిస్తారు. అట్టి విన్నపాలను పూర్తి స్థాయిలో పరిష్కారానికి సంబంధిత విభాగం (వింగ్) వారీగా విభజించి పంపిస్తారు సమస్యల పరిష్కారం కోసం ఆయా విభాగాల వింగ్ అధికారులు ఫస్ట్ లెవెల్ క్షేత్ర స్థాయిలో కూడా ఒక్కొక్క సర్కిల్ కు ఒక్కొక్క విభాగం అధికారి ని బాధ్యులను చేశారు. వారు వచ్చిన ఫిర్యాదులు స్వీకరించి సత్వర పరిష్కార చర్యలు తీసుకుని తిరిగి నివేదిక పంపిస్తారు. సమస్య పరిష్కారంలో అలసత్వం గాని నిర్లక్ష్యం వహించిన అధికారి వివరాలు కూడా సంబంధిత విభాగపు భాధ్యత గల హెడ్ కు పంపిస్తారు. అలా సమస్యలను పరిష్కరించిన తర్వాత అధికారులు పంపించిన నివేదిక ఆధారంగాఅర్జీదారుని తో మాట్లాడి అతను పొందిన ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. ఒక్క సారి ఫోన్ కు స్పందించపోతే మూడు సార్లు ఫోన్ చేసి తీసుకుంటారు.
సేవలపై 1,18,662మందిసంతృప్తి
ఈ క్రమంలో రోజు వారీగా 63 శాతం అనగా 650 ఆవరేజ్ గా కాల్ చేసి ఫీడ్ బ్యాక్ ను సేకరిస్తున్నారు. 2022 సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ వరకు 2,41,752 ఫీడ్ బ్యాక్ కాల్స్ చేశారు. అందులో 1,55,259 అర్జీదారులకు ఫోన్ కనెక్ట్ అయ్యింది. అందులో 1,18,662 మంది సంతృప్తి వ్యక్తం చేశారు. 36,597 మంది విన్నపదారులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. 86,493 మంది వారి ఫోన్ కు స్పందించలేదు..ఈ విధంగా జనవరి మాసంలో 67 శాతం, అర్జీ దారులు సంతృప్తి వ్యక్తం చేశారు. అదే విధంగా ఫిబ్రవరి 71 శాతం మార్చి లో 68 శాతం, ఏప్రిల్ 75 శాతం, మే మాసం లో 69 శాతం, జూన్ లో 74 శాతం, జూలై లో 72 శాతం, ఆగస్టు లో 71 శాతం, సెప్టెంబర్ లో 76 శాతం, అక్టోబర్ లో 81 శాతం, నవంబర్ లో 84 శాతం డిసెంబర్ లో 86 శాతం విన్నవించిన వారు సంతృప్తి వ్యక్తం చేశారు.