Thursday, January 23, 2025

కెసిఆర్ సంక్షేమాభివృద్ధి వైపే ప్రజా ఆదరణ

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి వైపే ప్రజా ఆదరణ ఉందని డీసీసీబీ చైర్మన్, బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆలేరు నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం లింగరాజుపల్లి గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన యువనాయకులు, ముఖ్య నేతలు 330 మంది మహేందర్‌రెడ్డి సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాస స మావేశ మందిరంలో చేరికల కార్యక్రమం సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలతో ప్రజా ఆదరణతో పాటు నియోజకవర్గ స్థాయిలో బిఆర్‌ఎస్ పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయని అన్నారు.

నియోజకవర్గంలోని మండలాల్లోని అనేక గ్రామాల్లో కాంగ్రెస్, బిజెపి, ఇతర పార్టీల నుంచి ముఖ్య నేతలతో పాటు యువకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుతున్నారని, త్వరలో మరిన్ని చేరికలు ఉన్నాయని తెలిపారు. ఆలేరు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలతో మీ వెంట మేముంటామంటూ బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు.

అందులో భాగంగానే ఆత్మకూర్ మండం కాంగ్రెస్‌కు చెందిన ఎర్రసోమిరెడ్డి, ఇంజమూరి భిక్షపతి, బొడిగె భిక్షపతి, లింగారెడ్డి, సోమయ్య ఆధ్వర్యంలో భారీగా చేరికలు జరిగాయని చె ప్పారు. బీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో జాన్‌రెడ్డి, నరేష్, బాబు, మహేష్, స్వా మి, చందు, చంటి, అనిల్, రవి, తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూర్ బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బీసు చందర్‌గౌడ్, కోరె భి క్షపతి, ఉప్పలయ్య, భానుప్రకాష్, మల్లేష్, వెంకటేష్, రంగారెడ్డి, దశరథ, సోమిరెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News