- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ఆరు గ్యారంటీలు ప్రకటించాక ప్రజల్లో హస్తం పార్టీపై విశ్వాసం పెరిగిందని ఆ పార్టీ నేత మధుయాష్కీ అన్నారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో బిఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్యే పోటీ అని ఆయన పేర్కొన్నారు. చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్నారు. బిజెపి ఇన్ని రోజులు పసుపు బోర్డు ఎందుకు ఏర్పాటు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఎంపి అరవింద్ ఓడిపోతారన్న భయంతోనే ప్రధాని పసుపుబోర్డును ప్రకటించారని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బిజెపికి ఓటమి తప్పదన్నారు.
- Advertisement -