Saturday, November 23, 2024

జిల్లా ఎస్పి కార్యాలయంలో ప్రజావాణి

- Advertisement -
- Advertisement -

మెదక్: మెదక్‌ జిల్లా పోలీసు ప్రదాన కా ర్యాలయంలో జిల్లా ఎస్పి రోహిణి ప్రియదర్శిని ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో టేక్మాల్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన సునీత అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్నానని తన భర్త ఆనారోగ్యంతో మరణించి 13 సంవత్సరాలు అవుతుందని తనకు 15 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. భూమి తగదా విషయమై ఐదు సంవత్సరాల నుంచిమా పాలివారైనా కొంతమంది మనసులో పెట్టుకొని వాళ్ల ఇష్టానుసారంగా బూతు మాటలు తిడుతూ రమేష్ అనే వ్యక్తి నన్ను కింద పడేసి నా జుట్టు పట్టుకుని కొట్టి అందరి మధ్యలో అవమానపరిచాడని నా యొక్క కుడిచెవిని చెత్తో పట్టుకొని లాగితే చెవి తెగి రక్తగాయమై నాలుగు కుట్లు పడ్డాయి.

నన్ను శారీరకంగా మానసీకంగా ఇబ్బందుల గురిచేస్తున్నారు. వీళ్ల వల్ల నాకు ప్రాణహాని ఉన్నది వీరిపై ఇది వరకే కేసు నమోదు అయిందని కేసు విరమించుకోకపోతే నన్ను నా కొడుకుని చంపుతానని బెదిరిస్తున్నారని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్ట ప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయాలని టేక్మాల్ ఎస్సైకి సూచించారు. జిల్లా నలుమూలల నుంచి పలు ఫిర్యాదిదారులు రావడం జరిగిందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News