Friday, November 15, 2024

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ పాలన

- Advertisement -
- Advertisement -
  • జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్

దేవరకొండ: దేశంలోనే బిఆర్‌ఎస్ పార్టీ తిరుగులేని శక్తి అవతరించిందని బిఆర్‌ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పిఏపల్లి మండలం వద్దిపట్ల గ్రామానికి చెందిన వార్డు సభ్యులు చందుపాషాతోపాటు 100 మంది ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన నాయకులకు ఎమ్మెల్యే పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ సర్కార్ పాలన కొనసాగిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమం దేశమంతా అందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారు అని అన్నారు. ప్రతి బీఆర్‌ఎస్ కార్యకర్తకు పార్టీ నిరంతరం అండగా తోడుగా ఉంటుందన్నారు.

సర్కారు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు బీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని ఆయన అన్నారు. భారత దేశాన్ని 75 సంవత్సరాల్లో 70 ఏండ్లు కాంగ్రెస్, బిజెపి పార్టీలే పాలించాయి. ఈ రెండు పార్టీలు సమాఖ్య స్ఫూర్తిని కాపాడడంలోనూ, దేశాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించడంలోనూ దారుణంగా విఫలమయ్యాయి అని ఆయన అన్నారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల 70 ఏండ్ల పాలన ఫలితంగా నేడు ప్రజలు కనీస వసతులలేమితో కటకటలాడుతున్నారు అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ వంగల ప్రతాప్ రెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ వెలుగురి వల్లపు రెడ్డి,వైస్ ఎంపీపీ అర్వపల్లి నర్సింహ, బిఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి తోటకురి పరమేష్, ఎర్ర యాదగిరి, రాయబోయిన శ్రీను, శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ గౌడ్, కుంటిగోర్ల అంజయ్య, వెంకన్న, దున్న ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News