Sunday, January 19, 2025

21న ఓటర్ల తుది జాబితా

- Advertisement -
- Advertisement -

గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారీలో జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్‌ఇసి) పార్థసారథి ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా, డివిజన్ పంచాయతీ అధికారులు, ఇఆర్‌ఇలతో గురువారం ఎస్‌ఇసి పార్థసారథి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ పంపించిన అసెంబ్లీ ఓటరు జాబితాల ఆధారంగా పంచాయతీలు, వార్డుల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేయాలని తెలిపారు. సెప్టెంబరు 6 నాటికి ముసాయిదా ఓటర్ల జాబితాలు తయారు చేసి, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి సూచనలు స్వీకరించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన ర్ తెలిపారు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులన్నీ జాగ్రత్తగా సిఇఒ నిబంధనల మేరకు పూర్తి చేసి సెప్టెంబరు 21న తుది జాబితా ప్రచురించాల ని పార్థసారథి ఆదేశించారు.

ఎవరైనా అర్హులైన ఓ టర్లు తమ పేర్లను గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాలో చేర్చుకోవాలన్నా, ఎవరైనా ఓటరు గ్రామ పంచాయతీ ఓటరు జాబితాలో కొనసాగించడానికి అభ్యంతరాలు ఉన్నా నిర్ధేశించిన ఫారంలలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. సంబంధిత ని యోజకవర్గంలో ఆ ఓటరు చేర్పు, తొలగింపు జరిగిన తర్వాతనే గ్రామ పంచాయతీ ఓటరు జాబితా ను పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఓటరు జాబితా సిబ్బంది తర్వాత వార్డుల వారీగా పోలింగ్ సిబ్బంది నియామకం, శిక్షణ తదితర అంశాలు ఉంటాయని వివరించారు. ఎన్నికల అ క్రమాలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు తయారు చేసిన గ్రీవెన్స్ మాడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ప్రారంభించారు. ఈ మ్యాడ్యూల్ ద్వారా ఎన్నికల ప్రక్రియలో జరిగే అవకతవకలు, నిబంధనల ఉల్లంఘనలపై సాధారణ పౌరులు ఫి ర్యాదు చేయవచ్చని అన్నారు. ఆ ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుని ఫిర్యాదుదారునికి తెలియజేస్తారని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో పంచాయతీ రా జ్ శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్, కమిషనర్ అనిత రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News