Monday, December 23, 2024

పబ్ ల్లో నిబంధనలు గాలికి…

- Advertisement -
- Advertisement -

మాస్కులేదు, సోషల్ డిస్టెన్స్ పాటించలే
సమయందాటినా వేడుకల నిర్వహణ
టాట్ పబ్బులో పోలీసులతో యువతి వాగ్వాదం
గచ్చిబౌలిలో యువతిపై దాడి, చోద్యం చూసిన పోలీసులు

High Court notices to ten pubs in the city

మన తెలంగాణ/సిటీబ్యూరో: నూతన సంవత్సర వేడుక ల్లో పబ్బులు నిబంధనలను బేఖాతర్ చేశాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించినా ఎవ్వరు కూడా పాటించలేదు. విచ్చలవిడిగా వ్యవహరించడంతో ఈవెంట్లు జరిగే ప్రాంతాల్లో గొడవలు, దాడులు జరిగాయి. సాధారణ సమయంలోనే పబ్బులు నిబంధనలు పాటించకుండా నిర్లక్షంగా వ్యవహరిస్తాయి. ఇక కొత్త సంవత్సర వేడుకులకు ప్రత్యేకంగా ముస్తాబైన ప బ్బులు ఎక్కడ కూడా నిబంధనలు పాటించలేదు. సామాజిక దూరంపాటించాలని, మాస్కు తప్పనిసరిగా పెట్టుకోవాలని, రెండు డోసుల టీకా తీసుకున్న వారిని మాత్రమే పబ్బులు, హోటళ్లు, క్లబ్బుల్లోకి అనుమతి ఇవ్వాలని ఆదేశాలు ఉన్నా ఏ ఒక్కపబ్బు కూడా పట్టించుకోలేదు. పబ్బుల్లో సామాజిక దూరం అనేది గాలికి వదిలేసి ఎం జాయ్ చేశారు. మద్యం తాగుతూ, డ్యాన్సులు చేస్తు నిబంధనలు పాటించలేదు. మద్యం మత్తులో చాలా పబ్బుల్లో గొడవలు జరిగాయి, మద్యం తాగి యువకులు వాహనా లు నడపడంతో ఒకరు మృతి చెందారు. పబ్బుల్లో మద్యం తాగిన వారు రోడ్డు మీదికి వచ్చి గొడవలు పెట్టుకున్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పబ్బు ఎదుట నలుగురు యువకులు కలిసి యువతిపై దాడి చేశారు. దీంతో యువతి తలకు గాయాలు అయ్యాయి, యువకులు యువతిపై దాడి చేస్తున్న సమయంలో అక్కడే పోలీసులు ఉన్నా పట్టించుకోలేదని తెలిసింది.

Three Pubs Seized In Hyderabad City
టాట్ పబ్బు రూటే సపరేట్…
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టాట్ పబ్బు వివాదాల సుడిగుండంలో తేలుతోంది. ఎన్ని వివాదాలు వస్తున్నా కూడా నిర్వాహకులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. తాజాగా నూతన సంవత్సర వేడుకల్లో పబ్బులు గొడవ జరుగుతుండగా ఆపేందుకు వెళ్లిన పోలీసులపై యువతి కేకలు వేసిన సంఘటన చోటుచేసుకుం ది. తన బాయ్‌ఫ్రెండ్‌ను ప్రశ్నిస్తావా అంటూ చిందులు వేసింది. తెల్లవారుజామున 2.30 గంటలకు పబ్బులో పెద్దగా అరుపులు వినిపించడంతో జూబ్లీహిల్స్ పోలీసులు యువతి, యువకులకు సర్ధిచెప్పేందుకు యత్నించారు. మద్యం మత్తులో ఉన్న యువతి పోలీసులపై కేకలు వేసింది. నివాసాల మధ్య పబ్బు ఉండడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. పబ్బుకు వచ్చిన వారు మద్యం తాగి బాటిళ్లను తమ ఇళ్లపై విసురుతున్నారని గతంలో కాలనీ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు టాట్ పబ్బుపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో 10 కేసులు ఉన్నాయి. ఎన్నిసార్తు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పబ్బును అక్కడి నుంచి తరలించాలని, తమకు మనశాంతి లేకుండా చేస్తున్నారని స్థానికులు పబ్బు ఎదుట ధర్నా చేశారు. గతంలో టాట్ పబ్‌పై పలు ఆరోపణలు ఉన్నాయి. ఫార్మా కంపెనీలు డిలర్లకు రేవ్ పార్టీని పబ్బులే ఏర్పాటు చేయడంతో సంచలనంగా మారింది. న గరం నడిబొడ్డున పబ్బులో రేవ్ పార్టీ ఏర్పాటు చేయడంపై పలు ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా అర్ధరాత్రి తర్వాత అశ్లీల నృత్యాలు నిర్వహిస్తున్నారని, రాత్రి 2గంటల వరకు పబ్బును నిర్వహిస్తున్నారని స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నూతన సంవత్సర వేడుకల్లో కూడా పబ్బు నిర్వాహకులు నిబంధనలు పాటించకుండా నిర్ణీత సమ యం దాటినా కూడా వేడుకలు నిర్వహించారు. అంతేకాకుండా పెద్దగా సౌండ్, అరవడంతో స్థానికులు ఇబ్బందు లు పడ్డారు. స్థానికులు పబ్బు ఎదుట జరుగుతున్న గొడవను వీడియో తీశారు. పబ్బును అక్కడి నుంచి తరలించాలని కాలనీ వాసులు హైకోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే.
ఎక్సైజ్‌పై నెట్టేస్తున్న పోలీసులు

Pubs are not followed rules
నిబంధనలు ఉల్లంఘించిన పబ్బులపై చ ర్యలు తీసుకోకుండా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని పబ్బు చుట్టుపక్కల ఉంటున్న వారు ఆరోపిస్తున్నారు. తాము ఎన్నిసార్లు జూబ్లీహిల్స్ పో లీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. సాధారణంగా రాత్రి 11.30 గం టలకు పబ్బును మూసివేయాల్సి ఉంటుంది, కాని టాట్ పబ్బు తెల్లవారుజాము 2 గంటల వరకు నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. డయల్ 100కు ఫోన్ చేస్తే వచ్చి వెళ్తున్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని విమర్శిస్తున్నారు. పెద్దగా సౌండ్ పెట్టడంతో వృ ద్ధులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పబ్బుల లైసెన్స్ తదితరాల వ్యవహారాలు మొత్తం ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ చూసుకుంటుందని, పబ్బులు తమ పరిధిలోకి రావలని పోలీసులు తప్పించుకుంటున్నారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News