Sunday, December 22, 2024

పండగ పూట నడి రోడ్డుపైనే పూడిక

- Advertisement -
- Advertisement -

చాంద్రాయణగుట్ట : జీహెచ్‌ఎంసి చార్మినార్ జోన్ పరిధిలో కచ్చామోరీల నిర్వాహణ అధ్వాన్నంగా తయారయింది. జంగమ్మెట్ డివిజన్ ఛత్రినాక శివగంగానగర్ ప్రధాన రోడ్డుపై కచ్చామోరీలోని పూడిక గత నెల 9న తీశారు. మొక్కుబడిగా తీయటంతో మరోసారి పొంగిపొర్లింది. అదే మ్యాన్‌హోల్ జూన్ 15న రెండవ సారి పూడిక తీశారు. రెండు సార్లు తీసిన పూడికను రోడ్డు మధ్యలో, మ్యాన్ హోల్ పక్కనే వేశారు. నెల రోజులు దాటిన పూడిక నడీరోడ్డుపైనే ఉంది.

పూడిక కుప్ప రోడ్డు మధ్యలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తోంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు పూడిక తడిసి ముద్దైయ్యింది. వరద ఉధృతికి కొంత కొట్టుకుపోయి రోడ్డంతా విస్తరించింది. ఈనెల 16న బోనాలు, 17న ఊరేగింపు ఉండటంతో బస్తీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కచ్చామోరీ నుండి తీసిన పూడికను బల్దియా అధికారులు వెంటనే తొలగించాలని కోరుతున్నారు. పండగ పూట ఇళ్ళ ముందు, నడిరోడ్డుపై పూడిక కుప్పు ఉండటం వల్ల పండగ వాతావరణాన్ని దెబ్బ తీస్తుందని వాపోతున్నారు. కనీసం ఇప్పటికైనా జీహెచ్‌ఎంసి చార్మినార్ జోన్ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News