- Advertisement -
ఇటీవల వంట గ్యాస్ ధరలు పెరగుతుండటంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రజల నుంచి వ్యతిరేక రాకుండా జాగ్రత్తలు వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పుదుచ్చేరి ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. బిపిఎల్ వర్గాలకు గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ ప్రకటించింది. నెలకు ఒక గ్యాస్ సిలిండర్ పై రూ.300 ఎల్‌పిజి సబ్సిడీ ఇవ్వనున్నట్లు తెలిపింది. ప్రస్తుత బడ్జెట్ లో రూ.126 కోట్లను కేటాయించనున్నట్లు పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి వెల్లడించారు.
దీంతో కుటుంబ రేషన్ కార్డులను కలిగి ఉన్న అన్ని కుటుంబాలకు ప్రయోజనం చేకూరునుందని ఆయన తెలిపారు.
- Advertisement -