Tuesday, November 5, 2024

పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం

- Advertisement -
- Advertisement -

పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం
ముఖ్యమంత్రి నారాయణసామి రాజీనామా
గవర్నర్ తమిళిసైకు రాజీనామా లేఖ సమర్పణ
ఓటింగ్ జరగకుండానే వీగిన విశ్వాస తీర్మానం
ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిపక్షాల సమాలోచనలు

పుచుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం సోమవారం పతనమైంది. గత కొద్ద రోజులుగా సాగుతున్న పార్టీ ఎమ్మెల్యేలు, ఒక డిఎంకె శాససభ్యుడి రాజీనామాలతో మైనారిటీలో పడి పోయిన కాంగ్రెస్ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో ఓటమి చెందడంతో ముఖ్యమంత్రి వి నారాయణసామి రాజీమానా చేశారు. అధికార పక్షం బలం 11కు తగ్గిపోగా ప్రతిపక్షం బలం 14కు పెరిగిన నేపథ్యంలో సోమవారం లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసైని కలుసుకున్న నారాయణసామి తన క్యాబినెట్ రాజీనామా లేఖను సమర్పించారు. కాగా, ప్రస్తుతానికి ప్రభుత్వాన్న ఏర్పాటు చేసే యోచన తమకు లేదని ప్రతిపక్ష నాయకుడు, ఎన్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్ రంగసామి ప్రకటించారు. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
ఎమ్మెల్యల రాజీనామాల కారణంగా అధికాన పక్ష బలం మైనాటిరీలో పడిపోయిందని, అసెంబ్లీలో విశ్వాస పరీక్షను నిర్వహించాలని ప్రతిపక్షం గత వారం కోరడంతో లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సోమవారం బల నిరూపణ కోసం సోమవారం అసెంబ్లీని ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అసెంబ్లీలో పార్టీల వారీగా బలబలాలు ఈ విధంగా ఉన్నాయి: కాంగ్రెస్(స్పీకర్‌తో కలుపుకుని 9), డిఎంకె 2, ఆల్ ఇండియా ఎన్‌ఆర్ కాంగ్రెస్ 7, ఎఐఎడిఎంకె 4, వోటింగ్ హక్కులతో నామినేటెడ్ సభ్యులు 3, ఒక ఇండిపెండెంట్(ప్రభుత్వాన్ని బలపరిపరిచారు). ఏడు స్థానాలకు ఖాళీలు ఉన్నాయి. రాజీనామా చేసిన వారిలో మాజీ మంత్రులు ఎ నమశ్శివాయం(ప్రస్తుతంలో బిజెపిలో చేరారు), మల్లాడి కృష్ణారావు.
సోమవారం అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అనంతరం నారాయణసామి మాట్లాడుతూ బల పరీక్షలో నామినేటెడ్ సభ్యులకు వోటింగ్ హక్కులు కల్పించడాన్ని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయకుండా కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం, ఇక్కడి ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయని ఆయన ఆరోపించారు. తన ప్రభుత్వంపై గత గవర్నర్ కిరణ్ బేడి కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వాలను బిజెపి కూల్చిన చరిత్ర గతంలో అరుణాచల్ ప్రదేశ్‌లో చూశామని, ఇప్పుడు పుదుచ్చేరిలో కాంగ్రెస్ సారథ్యంలోని కూటమి ప్రభుత్వాన్ని కూల్చడంలో బిజెపి తెరవెనుక పాత్ర పోషించిందని ఆయన ఆరోపించారు. పుదుచ్చేరిలోని ప్రతిపక్షాలతో చేతులు కలిపి కేంద్రం ప్రజాస్వామ్యాన్ని ఖానీ చేసిందని నారాయణసామి విరుచుకుపడ్డారు. కేంద్రానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.
కాగా..ఎటువంటి ఓటింగ్ చేపట్టకుండానే ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం వీగిపోయిందని స్పీకర్ విపి శివకొలుందు ప్రకటించడంతో అధికార పక్ష సభ్యులు నిరసన తెలియచేస్తూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ప్రజలు ఎన్నుకున్న సభ్యులకు మాత్రమే సభలో ఓటింగ్ హక్కు ఉండాలని, నామినేటెడ్ సభ్యులకు ఓటింగ్ హక్కు ఉండకూడదన్న తమ అభిప్రాయాన్ని స్పీకకర్ ఆమోదించలేదని, అందుకే తాము సభ నుంచి వాకౌట్ చేసి గవర్నర్‌ను కలుసుకుని తమ రాజీనామా లేఖను సమర్పించామని నారాయణసామి తెలిపారు. తన వెంట కాంగ్రెస్ మంత్రులు, డిఎంకె ఎమ్మెల్యేలతోపాటు తమ ప్రభుత్వానికి మద్దతిచ్చిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఉన్నారని ఆయన తెలిపారు. తమ రాజీనామాపై నిర్ణయం తీసుకోవలసింది ఇక గవర్నర్ అని ఆయన తెలిపారు.

Puducherry CM Narayanasamy resigns

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News