- Advertisement -
న్యూఢిల్లీ: పుదుచ్చేరి రాజకీయాల్లో గంటగంటకు నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇవాళ మరో ఇద్దరు ఎంఎల్ఎలు రాజీనామా చేశారు. కాంగ్రెస్ ఎంఎల్ఎ లక్ష్మీనారాయణన్ పదవికి రాజీనామా చేశారు. అటు డిఎంకె ఎంఎల్ఎ వెంకటేశన్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. పుదుచ్చేరి అసెంబ్లీలో రేపు సాయంత్రం 5గంటలకు బలపరీక్ష జరుగనుంది. రేపు బలపరీక్షకు ముందు ఇవాళ ఇద్దరు ఎంఎల్ఎల రాజీనామాలు చేయడంతో సర్వత్ర ఆసక్తి నెలకొంది. పుదుచ్చేరి అసెంబ్లీలో మొత్తం శాసనసభ్యుల సంఖ్య 30గా ఉంది. రాజీనామాలతో కాంగ్రెస్ కూటమి బలం 12కు పడిపోయింది. రాజీనామాలతో బలపరీక్ష ఉత్కంఠభరితంగా మారింది. పుదుచ్చేరి శాసనసభకు ఏప్రిల్- మే మధ్య ఎన్నికలు నిర్వహించనున్నారు.
Puducherry Congress MLA Lakshminarayanan Resign
- Advertisement -