Wednesday, January 22, 2025

పుదుచ్చేరి పబ్లిక్ ప్రదేశాలలో మాస్క్ తప్పనిసరి!

- Advertisement -
- Advertisement -

పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రదేశమైన పుదుచ్చేరిలో మాస్క్ ధరించడం తప్పనిసరి అని అక్కడి అడ్మినిస్ట్రేషన్ శుక్రవారం ఆంక్ష విధించింది. కొవిడ్19 కేసులు పెరిగినందున ఈ నిబంధన వెంటనే అమలులోకి వచ్చింది. జిల్లా కలెక్టర్ ఈ. వల్లవన్ కేంద్ర పాలిత ప్రదేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయని తెలిపారు. అక్కడి అడ్మినిస్ట్రేషన్ ముందస్తు చర్యలు చేపట్టింది. రానున్న రోజుల్లో కొవిడ్ కేసులు పెరుగకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టింది.

‘ప్రజా ప్రదేశాలలో…అంటే, బీచ్ రోడ్డు, పార్కులు, థియేటర్లలో మాస్క్‌లు ధరించడం తప్పనిసరి’ అని కలెక్టర్ వల్లవన్ విలేకరులకు తెలిపారు. పుదుచ్చేరి అంతటా టెస్ట్, ట్రాక్, ట్రీట్, వాక్సినేషన్ మీద దృష్టి సారిస్తామని అన్నారు.
ఇదిలావుండగా హెల్త్ డైరెక్టర్ జి. శ్రీరాములు శుక్రవారం కరోనా యాక్టివ్ కేసుల జాబితా విడుదల చేశారు. ప్రస్తుతం పుదుచ్చేరిలో 206 యాక్టివ్ కేసులున్నాయి. వాటిలో ఏడుగురు రోగులు ఆసుపత్రుల్లో ఉండగా, 199 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. నేడు పాజిటివ్ రేటు 9.65 శాతంగా ఉందన్నారు. కారైకాల్‌కు చెందిన ఓ మహిళ కొవిడ్ 19 కారణంగా కొన్ని రోజుల కిందట ‘జిప్‌మెర్’ ఆసుపత్రిలో చనిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News