న్యూఢిల్లీ: పుదుచ్చేరిలో ప్రభుత్వం పడిపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై కేంద్రీకృతమై ఉంది. తమిళిసై ఏ నిర్ణయం తీసుకోనున్నారన్న దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఆమె నిర్ణయం కోసం రాజకీయ వర్గాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. పుదుచ్చేరిలో ఏప్రిల్- మే నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో రాజ్యంగ పదవిలో ఉన్న తమిళిసై సౌందరరాజన్ ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తి రెకిత్తిస్తోంది. పుదుచ్చేరిలో ప్రభుత్వం కూలిపోవడంతో లెఫ్టినెంట్ గవర్నర్ గా తమిళిసైక్రియాశీలక పాత్ర నిర్వహించాల్సి ఉంది. ప్రతిపక్ష కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వనించడం, రాష్ట్రపతి పాలనకు సిపార్సు చేయడం, శాసన సభను రద్దు చేయడం ప్రత్యామ్నాయాలు ఆమె ముందు ఉన్నాయని రాజకీయ నిపుణులు అంటున్నారు. వీటిలో లెఫ్టినెంట్ గవర్నర్ గా తమిళిసై ఏ నిర్ణయం తీసుకుంటారో అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.
Puducherry Political Crisis Update