- Advertisement -
తమిళనాడు, పుదుచ్చేరి సమీపంలో ఆదివారం తీరాన్ని తాకిన ఫెంగల్ తుఫాన్ ప్రభావానికి భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. తమిళనాడు కృష్ణగిరి జిల్లా దారుణంగా దెబ్బతింది. ఉత్తంగిరిలో 14 గంటలకు పైగా భారీ వర్షాలు కురిశాయి. ఉత్తంగిరి బస్స్టాండులో బస్సులు, కార్లు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. తమిళనాడు వ్యాప్తంగా ఏడు వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. 147 శిబిరాల్లో వారికి ఆశ్రయం కల్పించామన్నారు. పుదుచ్చేరి కృష్ణానగర్ లోని కొన్ని ప్రాంతాల్లో నీటిమట్టం దాదాపు ఐదు అడుగులకు పెరిగింది. దాదాపు 500 ఇళ్ల లోని నివాసితులు వరదల్లో చిక్కుకున్నారు వీరిలో 100 మందికి పైగా ప్రజలను ఆర్మీ రక్షించిందని అధికారులు తెలిపారు.
- Advertisement -