చెన్నై: తన కంటే బిడ్డపై భర్త ఎక్కువ ప్రేమ చూపుతున్నాడని ఐదు నెలల బాలుడిని కసాయి తల్లి నీటి డ్రమ్ములో ముంచి చంపింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం పుదుకోట్టైలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరా లప్రకారం…. కన్నాంగుడికి చెందిన మణికంఠన్(31) రెండు సంవత్సరాల క్రితం పులియార్ గ్రామానికి చెందిన లావణ్య(20)ను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఐదు నెలల క్రితం బాబు జన్మించాడు. బాబు పుట్టినప్పటి నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. బాలుడు అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
లావణ్య బిడ్డ జన్మించడంతో తన పుట్టింట్లో ఉంటుంది. ఆదివారం రాత్రి ఇంట్లోకి దొంగలు చొరబడి బంగారు నగలు, నగదుతో బాబును ఎత్తుకెళ్లారని లావణ్య కేకలు వేసింది. స్థానికులు ఇంట్లో వచ్చి పరిశీలించారు. ఎక్కడా దొంగతనం జరిగినట్టుగా కనిపించకపోవడంతో బిడ్డ కోసం వెతికారు. ఇంట్లో ఉన్న నీటి డ్రమ్ములో చూడగా బాలుడి మృతదేహం కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి తల్లిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే చంపానని ఒప్పుకుంది. భర్త తనతో ప్రేమగా ఉండకుండా బిడ్డపై ఎక్కువ ప్రేమ చూపుతున్నాడు. దీంతో బిడ్డను చంపానని తల్లి ఒప్పుకుంది. వెంటనే ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.