Monday, December 23, 2024

ఏకాదశి రోజున ‘వారాహి’ వాహనానికి పూజ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నూతన సంవత్సరంలో పవన్ కళ్యాణ్ ‘వారాహి’ వాహనానికి పూజ చేయించనున్నారు. తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో ఈ ప్రత్యేక పూజ జరగనుంది. వచ్చే నెల 2వ తేదీన ఏకాదశిని పురస్కరించుకొని జనసేన నేతలు వాహన పూజకు ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఇక్కడ పూజ చేసిన తర్వాత ఎపిలోని విజయవాడ కనకదుర్గ ఆలయంలోనూ పూజా కార్యక్రమాలను పవన్‌కళ్యాణ్ నిర్వహించనున్నారు.

ఎపిలో ఎన్నికల ప్రచారానికి జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ ‘వారాహి’ వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు. ఈ వాహనాన్ని పవన్ తనకు కావాల్సిన విధంగా తయారు చేయించారు. ఎన్నికలే టార్గెట్‌గా ప్రజల్లోకి వెళ్లేందుకు పవన్ సిద్ధం అవుతున్నారు. ఈ వాహనానికి అమ్మవారి పేరు పెట్టారు. దుర్గాదేవి సప్త మాతృకల్లో వారాహి అమ్మవారు ఒకరు కావడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News