Tuesday, September 17, 2024

రహానె, పుజారాల కెరీర్‌పై నీలినీడలు

- Advertisement -
- Advertisement -

ముంబై : టెస్టు స్పెషలిస్ట్ బ్యాటర్లు అజింక్యా రహానె, చతేశ్వర పుజారాల కెరీర్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం టీమిండియాలో చోటు కోల్పోయి ఫామ్ కోసం తంటాలు పడుతున్న వీరిద్దరినీ దులిప్ ట్రోఫీకి సయితం సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. టెస్టుల్లో రాహుల్ ద్రవిడ్, వివివెస్ లక్ష్మణ్‌ల వారసులుగా పేరు తెచ్చుకున్న వీరిద్దరూ ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి అగ్రశ్రేణి జట్లపై టీమిండియా విజయాలు సాధించడంలో వీరి ప్రాత కీలకమనే చెప్పవచ్చు.

తాజాగా సెలెక్టర్లు దులిప్ ట్రోఫీలో ఆడేందుకూ వీరికి అవకాశం ఇవ్వడం లేదనే సమాచారం. అనంతపురంలో వచ్చే నెల 5 నుంచి ప్రారంభం కానున్న ట్రోఫీలో ఆరు మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్‌లలో రోహిత్, కోహ్లీ, సూర్యాకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్, రవీంద్రా బడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లు సయితం ఆడనున్నారు. అయితే ఈసారి దులిప్ ట్రోఫీకి రహానె, పుజారా ఎంపికకాకుంటే వారి కెరీర్ దాదాపు ముగిసినట్టేనని చెప్పొచ్చు.

ఇక పుజారా గత నాలుగేళ్లుకు రాణించలేక పోతున్నాడు. ఫామ్ లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. 2020 నుంచి ఇప్పటి వరకూ 28 టెస్టులాడిన పుజారా సగటు 30తో పరుగులు చేసి తేలిపోయాడు. ఒక్క టెస్టులోనే మూడంకెల స్కోరు సాధించగలిగాడు. దీంతో టీమిండియా చోటు కోల్పోవలసి వచ్చింది. 2022 నుంచి ఫామ్ లేమితో జట్టులో స్థానం కోల్పోయిన రహానె ఐపిఎస్ గతయ సీజన్ చెన్నై సపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగాడు. సూపర్ ఫాస్ట్ బ్యాటింగ్ సెలెక్టర్లు ఆకర్షించి డబ్లుటిసి ఫైనల్లో ఆడిన భారత జట్టులో చోటు సంపాదించాడు. రెండు ఇన్నింగ్స్‌లో 86, 48 పరుగులు సాధించి ఫర్వాలేదనిపించాడు. అనంతరం విండీస్‌తో జరిగిన టెస్టులో పేలవ ప్రదర్శన చేసిన జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు.

నాలుగు జట్టతోనే..
సాధారణంగా దులిప్ ట్రోఫీలో ఈస్ట్, సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, నార్త్ ఈస్ట్ జోన్స్ ఆడుతాయి. కానీ ఈసారి సెలెక్టర్లు ఈ టోర్నీని నాలుగు జట్లతోనే ఆడించనున్నారు. భారత సీనియర్, భారత్-ఎ ఆటగాళ్లతో పాటు రంజీ క్రికెట్‌లో సత్తా చాటిన డొమెస్టిక్ క్రికెటర్లతో కలిపి ఎ, బి, సి, డి జట్లతో ఈ టోర్నీని నిర్వహించాలని అజిత్ అగార్కర్ సెలక్షన్ కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ టోర్నీ ద్వారా భారత ఆటగాళ్లకు సరైన మ్యాచ్ ప్రాక్టీస్ అందించడంతో పాటు.. అత్యుత్తమ టాలెంట్‌ను బయటకు తీయాలని వారు భావిస్తున్నారు. ఈ టోర్నీలో పాల్గొనే నాలుగు జట్లకు రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.

స్టార్ ఆటగాళ్లతో సమతూకంగా..
నాలుగు జట్లకు అవసరమయ్యే ఓపెనర్లు, మిడిలార్డర్ బ్యాటర్లు, వికెట్ కీపర్లు, ఆల్‌రౌండర్లు, స్పిన్నర్లతో పాటు పేసర్లను ఎంపిక చేయడంపై భారత సెలెక్షన్ కమిటీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ టోర్నీ ద్వారా దేశవాళీ ఆటగాళ్లకు కూడా సీనియర్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకునే అవకాశం లభించనుంది. బిసిసిఐ నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ సెప్టెంబర్ 5 నుంచి 24 వరకు జరగాల్సి ఉంది. అయితే టోర్నీని నాలుగు జట్లకు కుదిస్తే.. షెడ్యూల్‌లో కూడా స్వల్ప మార్పులు జరగనున్నాయి. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో దులిప్ ట్రోఫీ ఈ విరామ సమయంతో నిర్వహించాలని భావిసస్తున్నారు.అయితే దీనిపై బిసిసిఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News