లండన్: మిస్టర్ డిపెండబుల్‌గా పేరు తెచ్చుకున్న టీమిండియా నయా వాల్ చటేశ్వర్ పుజారా వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో జట్టులోనే అత్యంత కీలకమైన బ్యాట్స్‌మన్‌గా భావిస్తున్న పుజారా చెత్త బ్యాటింగ్‌తో అభిమానులకు నిరాశే మిగుల్చుతున్నాడు. కిందటి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసి గాడిలో పడినట్టు కనిపించాడు. ఇలాంటి స్థితిలో గురువారం ఆరంభమైన ఓవల్ టెస్టు మ్యాచ్‌లో పుజారా మెరుపులు మెరిపించడం ఖాయమని జట్టు యాజమాన్యం భావించింది.
అయితే పుజారా మాత్రం తన పేలవమైన ఫామ్‌ను మరోసారి కొనసాగిస్తూ తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న పుజారా ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నాడు. లీడ్స్‌లో జరిగిన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఒక పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో రాణించడంతో అతను మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్టు కనిపించింది. కానీ ఓవర్‌లో వచ్చే సరికి మళ్లీ పాత కథే పునరావృతమైంది. ఈసారి పుజారా మళ్లీ చేతులెత్తేశాడు. 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. జట్టును ఆదుకుంటాడని భావించిన పుజారా సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరగడంతో టీమిండియా బ్యాటింగ్‌పై బాగానే ప్రభావం చూపింది.
వరుసగా అవకాశాలు లభిస్తున్నా దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో పుజారా వైఫల్యం చెందుతున్నాడు. ఇది అతనితో పాటు జట్టుకు ప్రతికూలంగా మారుతోంది. గతంలో అసాధారణ బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్ల బౌలర్ల సాహనాన్ని పరీక్షించిన ఘనత పుజారా సొంతం. అతను క్రీజులో ఉన్నాడంటే చాలు జట్టుకు మెరుగైన స్కోరు ఖాయంగా కనిపించేది. కానీ కొన్నేళ్లుగా పుజారా అలాంటి బ్యాటింగ్‌ను కనబరచలేక పోతున్నాడు. వరుస వైఫల్యాలతో జట్టుకు భారంగా మారాడు. ఇక అతన్ని తుది జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్ ఈ మధ్య జోరందుకుంది. పలువురు మాజీ క్రికెటర్లు పుజారాను తొలగించి అతని స్థానంలో యువ క్రికెటర్లకు చోటు కల్పించాలని సూచిస్తున్నారు. అయితే జట్టు యాజమాన్యం మాత్రం అతనిపై ఇంకా ఆశలు పెట్టుకుంది. తనపై ఎంతో నమ్మకం పెట్టుకున్న కెప్టెన్‌ను, కోచ్‌లను పుజారా నిరాశ పరుస్తున్నాడు. పేలవమైన బ్యాటింగ్‌తో సతమతమవుతున్నాడు. ఇప్పటికైనా అతను తన బ్యాటింగ్‌ను మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే రానున్న సిరీస్‌లలో అతనికి తుది జట్టులో స్థానం కాపాడుకోవడం చాలా కష్టమని చెప్పక తప్పదు.