Wednesday, January 22, 2025

పూజారా డబుల్ సెంచరీ… నయావాల్ ఆ సిరీస్‌కు సిద్ధం

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: భారత టెస్టు స్పెషలిస్టు ఛటేశ్వర్ పూజారా రంజీ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసి దూకుడుగా ఆడుతున్నాడు. జార్ఖండ్- సౌరాష్ట్ర మధ్య జరుగుతున్న మ్యాచ్ లో సౌరాష్ట్ర తరపున పూజారా 243 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 17వ డబుల్ సెంచరీ చేశాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ తరువాత జట్టుకు పూజారా దూరమయ్యాడు.  డబుల్ సెంచరీతో ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌కు తాను సిద్ధంగా ఉన్నానని సెలెక్టర్లకు సందేశం పంపినట్టుగా ఉంది. 356 బంతుల్లో డబుల్ సెంచరీ చేయడంతో సౌరాష్ట్ర 578/4 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. సౌరాష్ట్ర బౌలర్లు జార్ఖండ్ వెన్నువిరచడంతో 142 పరుగులకే ఆలౌటైంది. చిరాజ్ జానీ ఐదు వికెట్లతో హడలెత్తించాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News