ముంబై: టీమిండియా సీనియర్ క్రికెటర్లు చటేశ్వర్ పుజారా, అజింక్య రహానెలు రంజీ సీజన్ బరిలోకి దిగనున్నారు. ఇటీవల కాలంలో ఇద్దరు పేలవమైన బ్యాటింగ్‌తో సతమతమవుతున్న విషయం తెలిసిందే. సౌతాఫ్రికా సిరీస్‌లో ఇటు పుజారా అటు రహానె ఘోరంగా విఫలమయ్యారు. దీంతో ఇద్దరికీ రానున్న సిరీస్‌లలో టీమిండియాలో చోటు కాపాడు కోవడం కష్టంగా మారింది. ఇక బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా ఇదే విషయాన్ని పరోక్షంగా వెల్లడించాడు. రంజీ ట్రోఫీలో ఆడి ఫామ్‌ను నిరూపించుకుంటేనే టీమిండియాలో స్థానం ఉంటుందని గంగూలీ స్పష్టం చేశాడు. దీంతో పుజారా, రహానెలు రంజీ ట్రోఫీని ఆడేందుకు సిద్ధమయ్యారు. ఇక సౌరాష్ట్ర తరఫున పుజారా బరిలోకి దిగనున్నాడు. ఇక రహానె ముంబైకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఇప్పటికే సౌరాష్ట్ర, ముంబై జట్లలో వీరికి చోటు దక్కింది. మరోవైపు సీనియర్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య మాత్రం రంజీ ట్రోఫీకి దూరంగా ఉండాలని నిర్ణయించాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా ప్రకటించాడు. రంజీల్లో హార్దిక్ బరోడాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
రంజీ బరిలోకి పుజారా, రహానె.. హార్దిక్ దూరం
- Advertisement -
- Advertisement -
- Advertisement -