Saturday, November 23, 2024

ఇలా అయితే కష్టమే!…. తీరు మారని పుజారా

- Advertisement -
- Advertisement -

Pujara worst batting in england tour

లీడ్స్: టీమిండియాలోనే అత్యంత కీలకమైన బ్యాట్స్‌మన్‌గా పేరు తెచ్చుకున్న మిస్టర్ డిపెండబుల్, నయా వాల్ చటేశ్వర్ పుజారా వరుస వైఫల్యాలతో జట్టుకు భారంగా మారాడు. ఒకప్పుడూ ప్రపంచ క్రికెట్‌లోని అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌లలో ఒకడిగా ఓ వెలుగు వెలిగిన పుజారా కొంత కాలంగా వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన డబ్లూటిసి ఫైనల్‌తో సహా తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లోనూ పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరుస్తున్నాడు. విదేశీ పిచ్‌లపై జట్టుగా అండగా నిలుస్తాడని భారీ ఆశలు పెట్టుకుంటే పుజారా మాత్రం చెత్త బ్యాటింగ్‌తో ఆశలపై నీళ్లు చల్లుతున్నా డు. కెరీర్ ఆరంభంలో పుజారా బ్యాటింగ్‌ను చూసిన వారు అతనికి నయా వాల్ అనే బిరుదును ఇచ్చాడు. భారత దిగ్గజం రాహుల్ ద్రవిడ్‌కు సరితూగే బ్యాట్స్‌మన్‌గా పుజారాకు పేరు వచ్చింది. పేరుకు తగినట్టే గతంలో జరిగిన సిరీస్‌లలో పుజారా బ్యాటింగ్‌లో అదరగొట్టిన విషయం తెలిసిందే. పలు మ్యాచు ల్లో జట్టుకు ఒంటిచేత్తో విజయాలు సాధించి పెట్టిన ఘనత ఈ నయా వాల్‌కు దక్కుతోంది. ముఖ్యంగా బౌన్సీ పిచ్‌లపై పుజారాకు తిరుగే ఉండేది కాదు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా వంటి పిచ్‌లపై ఆకాశమే హద్దుగా చెలరేగి పోయేవాడు. ఇతర బ్యాట్స్‌మన్‌లు పరుగులు సాధించడానికి తంటాలు పడిన చోటే పుజారా పరుగుల వరద పారించే వాడు.
అలాంటి పుజారా కొన్నేళ్లుగా పేలవమైన బ్యాటింగ్‌తో సతమతమవుతున్నాడు. ఒకటి రెండు మ్యాచుల్లో తప్ప పుజారా జట్టుకు ఉపయోగపడే ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేదంటే అతి శయోక్తి కాదు. ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన సిరీస్‌లో కూడా ఘోర వైఫల్యం చవిచూశాడు. కీలక ఆటగాళ్లందరూ గాయాలతో సిరీస్‌కు దూరమైన సమయంలో జట్టుకు అండగా నిలువడంలో పుజారా విఫలమయ్యాడు. అయినా అతనిపై జట్టు యాజమాన్యం ఇంకా ఆశలు పెట్టుకునే ఉంది. గతంలో అత ను ఆడిన ఇన్నింగ్స్‌లను దృష్టిలో పెట్టుకుని వరుస అవకాశా లు ఇచ్చుకుంటూ పోతోంది. కానీ పుజారా మాత్రం జట్టు తనపై పెట్టుకున్న ఆశలను నీరు గార్చుతున్నాడు.
వేటు తప్పకపోవచ్చు..
మరోవైపు జట్టుకు పెను భారంగా మారిన పుజారాను తుది జట్టు నుంచి తొలగించాలనే డిమాండ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. పలువురు మాజీ క్రికెటర్లు పుజారాను తప్పించి కొత్త ఆటగాడికి ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లి అండతో పుజారా వరుసగా ఛాన్స్‌లు సంపాదిస్తూనే ఉన్నాడు. కానీ ఇది ఎక్కువ కాలం నడువడం కష్టంగా కనిపిస్తోంది. వరుస వైఫల్యాల నేపథ్యం లో పుజారాను తప్పించాలనే ఒత్తిడి ఇటు కెప్టెన్‌పై అటు ప్రధాన కోచ్‌పై వస్తోంది. వారు కూడా ఎక్కువ కాలం పాటు పుజారాకు అండగా నిలిచే పరిస్థితులు కనిపించడం లేదు. ఇలాంటి స్థితిలో బ్యాటింగ్‌ను మెరుగు పరుచుకోవడం తప్పించి పుజారా ముందు మరో మార్గం లేకుండా పోయింది. గతంలో ఆడినట్టే ఆడితే పరుగులు సాధించడం అతనికి కష్టమేమీ కాదు.

అయితే విపరీతమైన ఒత్తిడి నేపథ్యంలో పుజారా తన సహా జ శైలీలో బ్యాటింగ్ చేయలేక పోతున్నాడు. ఇదే అతనికి ప్రధాన అవరోధంగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో పుజారా లోపాలను గుర్తించి అతనికి అండగా నిలువాల్సిన బాధ్యత బ్యాటింగ్ కోచ్‌పై ఉంది. అయితే బ్యాటింగ్ కోచ్‌కానీ, ప్రధాన కోచ్‌కానీ ఈ విషయంపై దృష్టి పెట్టడం లేదు. పుజారా సీనియర్ కావడంతో అతని లోపాలను గుర్తు చేసేందుకు కూడా బ్యాటింగ్ కోచ్ సాహసించడం లేదనే వార్తలు వినవస్తున్నాయి. కానీ కీలకమైన బ్యాట్స్‌మన్ కెరీర్ ప్రమా
దంలో పడిన ప్రస్తుత పరిస్థితుల్లో అతనికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చి అతని బ్యాటింగ్ గాడిలో పడేలా చూడాల్సిన బాధ్యత కోచ్‌లతో పాటు కెప్టెన్‌పై ఎంతై నా ఉంది. ఇక పుజారా కూడా తన లోపాలను సవరించుకుని మళ్లీ పూర్వవైభవం అందుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. లేకుంటే రానున్న రోజుల్లో టీమిండియాలో చోటు సంపాదించడం దాదాపు అసాధ్యంగా మారినా ఆశ్చ ర్యం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News