Thursday, January 23, 2025

మైసమ్మ ఆలయంలో పూజలు

- Advertisement -
- Advertisement -

కడ్తాల్: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా 2వ రోజు శనివారం కడ్తాల మండలం మైసిగండి మైసమ్మ దేవాలయంలో ఆలయ ఫౌండరీ ట్రస్టీ చైర్మన్ రమావత్ సిరోలి ఫంతు నాయక్, ఆలయ ఈఓ స్నేహలత ఆధ్వర్యంలో ఉద్యోగులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.

తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మాదారం యాదగిరి గౌడ్, భానుప్రకాశ్, సంతోష్‌కుమార్, ఆనంద్, నాగేంద్ర శర్మ, వెంకటరమణ, సిబ్బంది బిక్కుమండ్ల చంద్రయ్య, బోడియ, కృష్ణయ్య, రమాదేవి, శ్రవణ్‌కుమార్, పత్యా, వెంకటేష్, శ్రీనివాస్, రాములు, బాలబ్రహ్మాచారి తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News