Wednesday, January 22, 2025

ఒక నిజాన్ని చూపించే చిత్రం

- Advertisement -
- Advertisement -

సిజు విల్సన్ ప్రధాన పాత్రలో కాయాదు లోహర్ కథానాయికగా తెరకెక్కిన మలయాళం యాక్షన్ పీరియడ్ డ్రామా ’పాథోన్‌పథం నూట్టండు’. వినయన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆల్ ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై నిర్మాత సిహెచ్. సుధాకర్ బాబు ఈ చిత్రాన్ని ’పులి’ – అనే టైటిల్‌తో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.

ఈ నేపధ్యంలో మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించారు. నిర్మాతల మండలి అధ్యక్షుడు కె.ఎల్. దామోదర్ ప్రసాద్ పులి ట్రైలర్ ని లాంచ్ చేశారు. అభినవ్ సర్దార్, సురేష్ కొండేటి తదితరులు ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈవెంట్‌లో నిర్మాత సుధాకర్ బాబు మాట్లాడుతూ “సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు కొత్త అనుభూతిని పొందుతారని అన్నారు. కె.ఎల్. దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ “చరిత్రలో చాలా నిజాలు దాగున్నాయి. అలా దాగున్న ఒక నిజాన్ని చూపించే చిత్రం పులి. విజువల్స్ ఎక్స్ టార్డినరీగా వున్నాయి”అని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News